![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -331 లో.. నేను లేకుండా మీటింగ్ ఎందుకు కండక్ట్ చేసావని కావ్యపై రాజ్ కోప్పడుతాడు. డీల్ క్యాన్సిల్ అవుతుందని మావయ్య గారు టెన్షన్ పడుతున్నారు. అందుకే చేసానని కావ్య అంటుంది. నాకు తెలుసు నీకు విడాకులు ఇస్తున్నానని అన్నాను కదా.. అందరు నీకు సపోర్ట్ చేసి నీ వైపు ఉండాలని అనుకుంటున్నావ్.. అందుకే మా డాడ్ ముందు ఇంప్రెషన్ కొట్టేయ్యాలనుకున్నావని రాజ్ అంటాడు.
ఆ తర్వాత నాది అంత చీప్ క్యారెక్టర్ కాదు. వాళ్ళకి మీ డిజైన్స్ చూపించి డీల్ ఒకే చెయ్యలేదు. నేను వేసిన డిజైన్స్ చూపించి ఒకే చేయించానని కావ్య అంటుంది. ఆ తర్వాత నీకు విడాకులు ఇస్తాను శ్వేతని పెళ్లి చేసుకుంటాను. నేనేదో మారుతానని ఆశలు పెట్టుకోకు నేను మారను. నాపై మనసు విరిచేసుకో ఇక్కడ నుండి వెళ్ళిపోమని రాజ్ అనగానే కావ్య ఏడుస్తూ వెళ్ళిపోతుంది. ఆ తర్వాత శ్వేత వచ్చి.. ఎందుకు అలా ఒక అమ్మాయిని బాధపెడుతావని రాజ్ ని అడుగుతుంది. నేనేంటి ఎదురు సమాధానం చెప్పకుండా వెనక్కి వస్తున్నానని కావ్య అనుకొని మళ్ళీ రాజ్ దగ్గరకి వెళ్తుంది. కావ్య వెళ్లేసరికి రాజ్, శ్వేత మాట్లాడుకుంటారు. నేను కావాలనే కావ్యతో అలా మాట్లాడాను. నాతో ఉండడం వాళ్ళ తను సంతోషంగా లేదు. అలా అని నేను తనతో ప్రేమగా ఉండలేను. తనపై ఎలాంటి ఫీలింగ్ లేదు. ఇలా మాట్లాడితే అయిన మనసు విరిగి నన్ను వదిలి వెళ్లి హ్యాపీగా ఉంటుందని శ్వేతకి రాజ్ చెప్తుంటాడు. ఆ మాటలన్నీ కావ్య వింటుంది. బాధపడుతూ వెళ్ళిపోతుంది.
ఆ తర్వాత ఆఫీస్ కి సంబంధించిన మేనేజర్ ఇంటికి వచ్చి.. సర్ అయిదు లక్షలు తీసుకొని రమ్మన్నాడని అపర్ణకి చెప్పగానే.. ఉండు తీసుకొని వస్తానని అపర్ణ వెళ్లి లాకర్ లో చూసేసరికి అందులో మూడు లక్షలు ఉంటాయి. అవి అతనికి ఇచ్చి పంపిస్తుంది. ఏంటి అతను అయిదు లక్షలు అడిగితే మూడు లక్షలు ఇచ్చావని రుద్రాణి అడుగుతుంది. అందులో మూడు లక్షలు ఉన్నాయని అపర్ణ చెప్తుంది. దొంగ చేతికి తాళాలు ఇస్తే ఇలాగే ఉంటుంది. ఆ డబ్బు కావ్య దొంగతనం చేసిందని ధాన్యలక్ష్మి అంటుంది. అలా ఎందుకు అంటావ్.. ఆ లాకర్ తాళాలు తీసుకొని వచ్చి ఇచ్చింది నీ కోడలు అనగానే.. అనామిక టెన్షన్ పడుతుంది. నేను తనే తీసింది అన్నట్లేదు కదా? ఎవరు తీశారు అనేదే కావ్య వచ్చాకే తెలుస్తుందని అపర్ణ అంటుంది. మరొకవైపు కావ్య వస్తుంటే కార్ రిపేర్ అవుతుంది. అప్పుడే రాజ్ వస్తాడు. పద వెళదామని అని కావ్యతో రాజ్ అంటాడు. మొదట రానని చెప్పినా తర్వాత నేను పుట్టింటికి వెళ్తానని చెప్పగానే పద అక్కడే దింపుతానని రాజ్ అంటాడు. దాంతో రాజ్ తో కావ్య వెళ్తుంది. తరువాయి భాగంలో కావ్య తన పుట్టింటి వాళ్ళతో రాజ్ వేరొక అమ్మాయితో తిరుగుతున్నాడు. ఆమెనే పెళ్లి చేసుకోబోతున్నడని వాళ్ళకి చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే
![]() |
![]() |